వీడని సాంబశివుడి అదృశ్యం మిస్టరీ
హైదరాబాద్: మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి సాంబశివుడి అదృశ్యం ఇంకా మిస్టరీగానే ఉంది. సాంబశివుడు పోలీసు అదుపులోనే ఉన్నాడని ఆయన తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బ్లూటైగర్స్ పోలీసులు, ప్రభుత్వం ఆడుతున్న నాటకమని వారు ఆరోపిస్తున్నారు. సాంబశివుడు తమ అదుపులో ఉన్నాడని, సాంబశివుడిని ప్రజాకోర్టులో శిక్షిస్తామని బ్లూటైగర్స్ పేర సూర్యం పేరుతో మీడియాకు ఫోన్ కాల్స్ వచ్చాయి.
సాంబశివుడి ఆచూకీ కోసం ఆయన తల్లిదండ్రులు, సోదరుడు రాములు ఆదివారంనాడు హోంమంత్రి జానారెడ్డిని కలిశారు. వారు ముందు డిజిపి యాదవ్ ను కలవడానికి వెళ్లారు. అయితే ఆదివారం తనకు సెలవని, కలవడానికి నిరాకరించారు. దాంతో సాంబశివుడి తల్లిదండ్రులు యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జానారెడ్డిని కలిశారు. సాంబశివుడు తమ అదుపులో లేడని ఆయన స్పష్టం చేశారు. సాంబశివుడి ఉదంతంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఓం శాంతి అంటూ ఆయన జవాబు దాటవేశారు.












Click it and Unblock the Notifications