మధుయాష్కీ ఇనిస్టెంట్ సెలిబ్రిటీ: బాజిరెడ్డి
హైదరాబాద్: తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ ఇనిస్టెంట్ సెలిబ్రిటీ అని కాంగ్రెస్ శాసనసభ్యుడు బాజిరెడ్డి గోవర్దన్ వ్యాఖ్యానించారు. పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామిని ఆయన ఇనిస్టెంట్ లెజెండ్ గా అభివర్ణించారు. ఎఐసిసి, సిబ్ల్యుసి సభ్యులైన తమ సీనియర్ కాంగ్రెస్ నాయకులకు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అప్పాయింట్ మెంటు దొరకలేదంటే అందరూ నవ్వుతారని, అది ఒక డ్రామా అని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
సీనియర్ల వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతోందని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే పార్టీ తుక్కుతుక్కుగా ఓడిపోతుందని వెంకటస్వామి అనడం వల్ల పార్టీకి నష్టం జరిగిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లు విమర్శలు మాని ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications