కేశవరావుతో హరీష్ రావు భేటీ
హైదరాబాద్/ నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు బుధవారం హైదరాబాదులో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) మాజీ అధ్యక్షుడు కె. కేశవరావును కలిశారు. తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ఆయన కేశవరావును కోరినట్లు సమాచారం. కేశవరావుతో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు హరీష్ రావు చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం గడువు పెడుతూ రాజీనామా చేయాలనే తమ నిర్ణయాన్ని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదని ఆయన నిజామాబాదులో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ముఖం చెల్లక కాంగ్రెస్ నాయకులు తమను విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తామని గెలిచిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాము సైనికుల్లా తమ పార్టీ అధ్యక్షుడికి రాజీనామా లేఖలు సమర్పించామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications