వైయస్ ను దింపే కుట్ర: మారెప్ప
హైదరాబాద్: తమ పార్టీ సీనియర్ కాంగ్రెస్ నాయకులకు ముఖ్యమంత్రి పదవిపై వ్యామోహం పెరిగిందని, దాంతో వైయస్ రాజశేఖర రెడ్డిని దింపి తాము ముఖ్యమంత్రులం కావాలని అనుకుంటున్నారని రాష్ట్ర మంత్రి మారెప్ప అన్నారు. తెలంగాణవాదం వినిపిస్తున్న కాంగ్రెస్ నాయకులపై ఆయన బుధవారం మరోసారి విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతోందని ఆయన అన్నారు. 2014 తర్వాతనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనే తన మాటకు కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు. అభివృద్ధి జరిగిన తర్వాత అన్నదమ్ముల్లా విడిపోదామని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications