ఎసిబికి చిక్కిన తహసీల్దార్ జనార్దన్
సంగారెడ్డి: స్వాతంత్ర సమరయోధుడి భార్య నుంచి పదివేల రూపాయల లంచం తీసుకుంటూ సంగారెడ్డి తహిస్ ల్దార్ జనార్దన్ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులకు చిక్కారు. జనార్దన్ నుంచి ఎసిబి అధికారులు 90 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. స్వాతంత్ర సమరయోధుల కోటాలో ప్లాటు ఇచ్చేందుకు జనార్దన్ లంచం అడిగారు. ఆ లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు జనార్దన్ ను పట్టుకున్నారు.
శివరాజు అనే స్వాతంత్ర్య సమరయోధుడు మరణించారు. స్వాతంత్ర సమరయోధుల కోటాలో ప్లాటు ఇవ్వాలని ఆయన భార్య శివమ్మ జిల్లా కలెక్టర్ ను కోరారు. దీంతో ఆమెకు 300 గజాల భూమి కేటాయించాలని కలెక్టర్ ఎమ్మార్వోను ఆదేశించారు. ఇంతలో పాత ఎమ్మార్వో బదిలీ అయ్యారు. కొత్తగా వచ్చిన జనార్దన్ శివమ్మ నుంచి లంచం డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications