హరిరామ జోగయ్య ఇంటిపై దాడి
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు చేగొండి హరిరామజోగయ్య ఇంటిపై ఆ పార్టీ కార్యకర్తలు ఆదివారంనాడు దాడి చేశారు. హైదరాబాదులోని మాదాపూర్ లో గల ఆయన ఇంటిపై నగర కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి ఇంటి కిటికీ అద్దాలు పగులగొట్టారు. హరిరామజోగయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ దాడిపై హరిరామజోగయ్య తీవ్రంగా ప్రతిస్పందించారు. తనపై దాడి వెనక ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హస్తం ఉందని, ఈ విషయాన్ని తాను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఫిర్యాదు చేస్తానని ఆయన అన్నారు.
తనపై దాడి చేసింది కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాదు అధ్యక్షుడు దానం నాగేందర్ మనుషులని ఆయన అన్నారు. తనపై హత్యాప్రయత్నం చేయించారని ఆయన అన్నారు. దాడులతో నోరు మూయించలేరని, అవినీతి ముమ్మాటికీ నిజమని ఆయన అన్నారు. అవినీతి గురించి మాట్లాడితే అంత కంగారెందుకని ఆయన అడిగారు. తనపై దాడి కాంగ్రెస్ పార్టీకే నష్టమని, రాష్ట్రంలో ముఠా నాయకత్వం సాగుతోందని ఆయన అన్నారు. ఒకరు రాజీనామా చేయమంటే తాను చేయనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
