హరిరామజోగయ్య సైతాన్: మారెప్ప
కడప: తమ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు చేగొండి హరిరామజోగయ్య సైతాను అని, సైతాను పార్టీలో ఉండకూడదని మంత్రి మారెప్ప అన్నారు. అవాకులు చెవాకుల వల్ల ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి నాయకత్వానికి ఢోకా లేదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. జోగయ్య పార్టీ నుంచి పోతే శని పోతుందని ఆయన వ్యాఖ్యానించారు.
పార్టీలు మారే హరిరామజోగయ్య విమర్శలను ఎవరూ పట్టించుకోరని, గండాలు సృష్టించడమే హరిరామజోగయ్య పని ఆయన అన్నారు. విమర్శల వల్ల విజ్ఞానం రాదని ఆయన జోగయ్యకు హితవు చెప్పారు. నాయకులకు నోరుండకూడదని, చెవులుండాలని ఆయన అన్నారు. పార్టీ నుంచి దొబ్బేస్తే తాను ఆరోణలు చేయడం వల్లనే దొబ్బేశారని చెప్పుకోవాలని చూస్తున్నారని ఆయన అన్నారు. జోగయ్య సమాధుల పద్ద పైసలేరుకునే రకమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
