చిరు పార్టీపై కమిట్ కాను: నాగబాబు


హైదరాబాద్: తమ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రాబోరని గానీ వస్తారని గానీ తాను చెప్పలేనని, రాబోరని చెప్పడానికి కూడా తాను సిద్దంగా లేనని సినీ నటుడు నాగబాబు అన్నారు. రాజకీయాల్లోకి రావడం, రాకపోవడంపై చిరంజీవి మాత్రమే మాట్లాడాల్సి ఉంటుందని ఆయన ఒక ప్రైవేట్ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. చిరంజీవి అభిమానులతో తన మంతనాలు మాత్రం మంచి పనులను ఎలా విస్తృతం చేయాలనేదాని మీదనే సాగుతున్నాయని ఆయన చెప్పారు. తాను చిరు అభిమానులతో చిరంజీవి రాజకీయ ప్రవేశంపై మాట్లాడడం లేదంటే కమిట్ అయినట్లేనని, అలా కమిట్ కాదలుచుకోలేదని ఆయన అన్నారు.

రాజకీయ ప్రవేశంపై చిరంజీవి చెప్పేదాకా తానేమీ మాట్లాడబోనని ఆయన అన్నారు. చిరంజీవి సినిమాలు రాజకీయ రంగంలో ప్రవేశించాలని ఉద్దేశించి మాత్రమే వచ్చాయనే మాటను తాను ఖండించడం గానీ, సమర్థించడం గానీ చేయనని, అయితే హీరో తనకు అనువైన పాత్రలే చేస్తారని ఆయన అన్నారు. చిరంజీవి సినిమాలను సినిమాలుగానే చేస్తున్నారని ఆయన అన్నారు. చిరంజీవి రాజకీయాల గురించి మాట్లాడే దాకా తనను అడగవద్దని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+