కొడితే జోగయ్య ఉంటారా?: దానం
హైదరాబాద్: కొడితే తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు చేగొండి హరిరామజోగయ్య కొడితే ఉంటారా అని కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దానం నాగేందర్ ప్రశ్నించారు. హరిరామజోగయ్యను పిచ్చాసుపత్రిలో చేరిస్తే వైద్యం ఖర్చులు తాము భరిస్తామని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తమ పార్టీ కార్యకర్తలు హరిరామజోగయ్యపై దాడి చేయలేదని, ఇంటి ముందు ధర్నా చేసి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారని ఆయన వివరించారు.
హరిరామజోగయ్యను కొట్టేంత సీను లేదని ఆయన అన్నారు. తమ పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా ధర్నా చేశారని ఆయన చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలు దాడి చేసి ఉంటే తాను క్షమాపణ చెప్పి ఉండేవాడినని ఆయన అన్నారు. జోగయ్య ఆరోపణలకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
