ఆత్మగౌరవ పరిరక్షణ నినాదం: బాబు
న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో తాము ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ నినాదంతో పోటీ చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చెప్పారు. యుఎన్ పిఎ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమ పార్టీ నేత ఎన్టీ రామారావు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడితే తాను ఆంధ్రుల ఆత్మ విశ్వాసాన్ని పెంచానని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కాంగ్రెస్ నాయకులకు అపాయింట్ మెంట్ ఇవ్వకుండా అవమానించారని, ఇది కాంగ్రెస్ సంస్కృతి అని ఆయన అన్నారు. విజయవాడ విద్యార్థిని అయేషా హత్య కేసుపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గానీ, హోంమంత్రి కె. జానారెడ్డి గానీ మాట్లాడకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
