అవమానంతో తిరిగొచ్చిన కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్: న్యూఢిల్లీ తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అవమాన భారంతో హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. ఆరు రోజులు ఢిల్లీలో మకాం వేసినప్పటికీ వారికి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసే అవకాశం లభించలేదు. తెలంగాణపై తాడో పేడో సోనియా వద్దనే తేల్చుకుంటామని ఢిల్లీకి వెళ్లిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు అధిష్ఠానవర్గానికి చెందిన కొంతమంది నాయకులను, ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసి తమ వాదనలు వినిపించారు. ఎంతకీ సోనియా అపాయింట్ మెంటు లభించకపోవడంతో వెనక్కి వచ్చారు.
ఆదివారం తెల్లవారుజాముననే హైదరాబాద్ తిరిగి వచ్చిన పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామి మీడియాకు ముఖం చాటేశారు. ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, కమలాకర్ రావు తదితరులు ఉదయం 11 గంటలకు హైదరాబాదుకు చేరుకున్నారు. తాము ఢిల్లీ యాత్ర విజయవంతమైందని వారు అన్నారు. తమ నేతలు సరైన సమయంలో ఢిల్లీ వెళ్లలేదని, దానివల్లనే వారితో సోనియా కలువలేకపోయారని పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. అయితే తమ నాయకులకు అవమానం ఏదీ జరగలేదని కాంగ్రెస్ యకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications
