తెరాస రాజీనామాలతో లాభం ఉండదు: సిపిఐ
హైదరాబాద్: తెలంగాణ విషయంలో కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రజాప్రతినిధుల రాజీనామాల వల్ల ప్రయోజనం ఉండదని సిపిఐ జాతీయ కార్యదర్శి, పార్లమెంటు సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. సమైక్య పోరాటాల వల్లనే ఏదైనా సాధించగలమని ఆయన అన్నారు. పార్టీ మహాసభలకు సంబంధించిన పోస్టర్ ను ఆయన ఆదివారంనాడు విడుదల చేశారు. బోఫోర్స్ కుంభకోణం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వంటి వాటి విషయాల్లో సమైక్యంగా పోరాడడం వల్లనే ఫలితం వచ్చిందని ఆయన అన్నారు.
తమ మహాసభల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా మార్చి 6వ తేదీన రాజీనామాలు చేయాలని తెరాస నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications
