సిపియం కార్యదర్శి మళ్లీ రాఘవులే
హైదరాబాద్: సిపియం రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా బి.వి. రాఘవులు మళ్లీ ఎన్నికయ్యారు. మూడు రోజుల పాటు జరిగిన పార్టీ రాష్ట్ర మహాసభల్లో రాఘవులును తిరిగి కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఆయన సిపియం కార్యదర్శిగా ఎన్నిక కావడం వరుసగా ఇది నాలుగో సారి. దీంతో తన బాధ్యత మరింత పెరిగిందని ఆయన అన్నారు. సిపియం సభల్లో విభేదాలు పొడసూపాయి. రైతు నాయకుడు రామచందర్ రావు సమావేశం నుంచి అర్థాంతరంగా బయటకు వెళ్లిపోయారు. పార్టీలో నియంతృత్వ పోకడలు సాగుతున్నాయని ఆయన విమర్శించారు.
ఆర్థికపరమైన ఆరోపణలు ఎదుర్కుంటున్న శాంతారావు, దేవిలను రాష్ట్ర కమిటీ నుంచి తప్పించారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా వై. వెంకటేశ్వరరావు, గఫూర్, సిహెచ్. నరసింహారావు, వీరయ్య, సారంపల్లి మల్లారెడ్డి, సిహెచ్. సీతారాములు, జి. నాగయ్య ఎన్నికయ్యారు. వంద మందితో రాష్ట్ర కమిటీకి ఎన్నుకున్నారు. దీంట్లో 10 కొత్త ముఖాలున్నాయి.












Click it and Unblock the Notifications
