గవర్నర్ ప్రసంగంపై పెదవి విరిచిన బాబు

Chandrababu Naidu
హైదరాబాద్: శాసనసభలో గవర్నర్ ఎన్.డి. తివారీ చేసిన ప్రసంగంపై ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు పెదవి విరిచారు. గవర్నర్ ప్రసంగం ప్రజాస్వామికంగా లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించిందని, హత్యల విషయంలో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని ఆయన విమర్శించారు. అయేషా హత్య కేసు విషయంలో ప్రభుత్వంపై ఆయన మరోసారి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 71 ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటు ద్వారా రైతుల పొట్ట కొడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రైతులు గిట్టుబాటు ధరలు పెరిగే వరకు పంటలను అమ్మకూడదని ఆయన సూచించారు.

ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఇటీవల చేసిన ప్రసంగాల క్రోడీకరణే గవర్నర్ ప్రసంగమని సిపియం శాసనసభా పక్ష నాయకుడు నోముల నరసింహయ్య అన్నారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ప్రభుత్వం ఒకటి రెండు కార్పోరేట్ ఆస్పత్రులకు 30 కోట్ల రూపాయలు సమకూర్చి పెట్టిందని ఆయన అన్నారు. పావలా వడ్డీ రుణాల ద్వారా మహిళలు ఎక్కడ లక్షాధికారులయ్యారో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+