పార్టీపై చిరంజీవే చెప్తారు: నాగబాబు
మంచిర్యాల: పార్టీ వ్యవహారాలు అన్నయ్యనే ప్రకటిస్తారని మెగాస్టార్ చిరంజీవి సోదరుడు, సినీ నటుడు నాగబాబు అన్నారు. ఇంత వరకు కోస్తా జిల్లాల్లో పర్యటించిన ఆయన ఇప్పుడు ఉత్తర తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. చిరంజీవి అభిమానులతో మాట్లాడడానికి ఆయన కరీంనగర్, గోదావరిఖని, మంచిర్యాల తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. సోమవారంనాడు మంచిర్యాలలో చిరు అభిమానుల మెగా బ్లడ్ క్యాంపును ఆయన ప్రారంభించారు.
దేనికైనా సిద్ధంగా ఉండాలని ఆయన చిరు అభిమానులకు పిలుపునిచ్చారు. సేవా కార్యక్రమాల్లో చిరంజీవి అభిమానులు ముందుంటారని ఆయన చెప్పారు. చిరంజీవి పార్టీ కోసం ఆయన అభిమానులను సిద్ధం చేయడమే కాకుండా చురుకైన వ్యక్తులను పార్టీ కార్యకలాపాల కోసం ఎంపిక చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నాగబాబు మాత్రం చిరంజీవి పార్టీ పెట్టే విషయమై అవునని గానీ కాదని గానీ చెప్పడం లేదు.












Click it and Unblock the Notifications
