హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ ఎన్.డి. తివారీ సోమవారం శాసనసభలో వరాల వర్షం కురిపించారు. ప్రతిపక్షాల నిరసనల మధ్యనే శాసనసభను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. కొన్ని చెదురుముదురు సంఘటనలు మినహా శాంతిభద్రతల పరిస్థితి రాష్ట్రంలో మెరుగ్గా ఉందని ఆయన అన్నారు.
గవర్నర్ ప్రసంగంలో ముఖ్యాంశాలు
24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా
3 వేల కోట్ల రూపాయలతో గోదావరి ఆయకట్టు ఆధునీకరణ
2009 నాటికి 27 సాగు నీటి ప్రాజెక్టుల పూర్తి
16.60 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ
అన్ని కోస్తా జిల్లాల్లో ఓడరేవులు
దేశంలోనే రాష్ట్రంలో అత్యధిక వృద్ధి రేటు సాధన
ప్రతి ప్రధానమైన పట్టణానికి నాలుగు లైన్ల రోడ్లు
కాపు విద్యార్థులకు ఉపకార వేతనాలు
క్రిస్టియన్లకు ఇజ్రాయెల్ యాత్ర
ముస్లిం, క్రిస్టియన్లలో సామూహిక వివాహాలు
అన్ని జిల్లాల్లో సెజ్ లు, పారిశ్రామికవాడల ఏర్పాటు
వచ్చే ఐదేళ్లలో సాగునీటి చెరువుల పునరుద్ధరణ
పర్యాటకాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ
ఇడుపులపాయ, నూజివీడుల్లో ఉపాధి శిక్షణా కేంద్రాలు
రాజీవ్ ఆరోగ్య మిషన్ ద్వారా మరో 3 కొత్త సేవలు
ఆదిలాబాద్, ఒంగోలు, శ్రీకాకుళంల్లో కొత్త వైద్య కళాశాలలు
గుంటూరు, వరంగల్, కాకినాడల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు