ప్రాంతీయ అసమానతల తొలగింపు: గవర్నర్

హైదరాబాద్: రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రాంతీయ అసమానతలను తొలగిస్తామని గవర్నర్ ఎన్.డి. తివారీ హామీ ఇచ్చారు. శాసనసభను ఉద్దేశించి సోమవారం చేసిన ప్రసంగంలో ఆయన ఈ హామీ ఇచ్చారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది సాధిస్తోందని ఆయన కొనియాడారు. మదర్సాల్లో లెక్కలు, సైన్స్, కంప్యూటర్ ఉపాధ్యాయులను నియమిస్తామని ఆయన చెప్పారు. చేతి వృత్తుల వారి కోసం రాష్ట్రంలో 7 బిసి స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.

రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల స్థాయి పెంచుతామని కూడా ఆయన హామీ ఇచ్చారు. అర్చకుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 18 ఆగమ పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 50 ప్రాచీన దేవాలయాల మరమ్మత్తులు చేపడతామని ఆయన చెప్పారు. ప్రభుత్వ, ప్రైవైట్ సంయుక్త భాగస్వామ్యంలో నిజాంపట్నం, భావనాడు, నర్సాపూర్ ఓడరేవులను అభివృద్ధి పరుస్తామని ఆయన చెప్పారు. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం ఎస్. రాయవరం వద్ద స్థల నిర్ధారణ చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో కేంద్రం 49 ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటుకు స్థలాలను గుర్తించిందని, దీని వల్ల 35 వేల కోట్ల మూలధన పెట్టుబడులు రాగలవని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+