తెరాస సభ్యులపై రోశయ్య మండిపాటు

శాసనసభా సమావేశాల మొదటి రోజే ఇలా అయితే ఎలా అని ఆయన ప్రశ్నించారు. సభా సమావేశాలను సక్రమంగా నడుపుకుందామని ఆయన ప్రతిపక్షాలకు సూచించారు. ప్రజా సమస్యలపై చర్చకు ప్రభుత్వం సమ్మతిస్తుందని ఆయన చెప్పారు. ప్రతిపక్షాల సభ్యులు గొడవ చేస్తుంటే తాము ఎంత సేపని మౌనంగా ఉంటామని, తమ ఓపికకు హద్దులుండవా అని ఆయన అడిగారు. సందర్భానికి విరుద్ధంగా మాట్లాడితే ఎలా అని ఆయన ప్రశ్నించారు. సభా గౌరవాన్ని కాపాడుకునేందుకు కృషి చేద్దామని ఆయన ప్రతిపక్షాలను కోరారు.












Click it and Unblock the Notifications
