గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్న తెరాస
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు సోమవారం శాసనసభలో గవర్నర్ ఎన్.డి. తివారీ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. గవర్నర్ ప్రసంగం ప్రతులను చించేసి గవర్నర్ వైపు విసిరేశారు. అనంతరం సభనుంచి వాకౌట్ చేశారు. గులాబీ కండువా వేసుకున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఫొటోలను ప్రదర్శించారు.
అనంతరం శాసనసభ ద్వారం వద్ద వారు ధర్నా చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని వారు తీవ్రంగా నిరసించారు. తెలంగాణపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా తెరాస శాసనసభ్యులు స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి ఇచ్చిన అల్పాహార విందును కూడా బహిష్కరించారు. గవర్నర్ ప్రసంగాన్ని తెలుగుదేశం సభ్యులు కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఈ అభ్యంతరాల మధ్యనే గవర్నర్ ప్రసంగం కొనసాగింది.












Click it and Unblock the Notifications
