గవర్నర్ ప్రసంగం అభివృద్ధికి అద్దం: వైయస్

వ్యవసాయానికి, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇస్తామని ఆయన చెప్పారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని అమలు చేస్తామని ఆయన చెప్పారు. గృహ నిర్మాణానికి నిధులు పెంచినట్లు ఆయన తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణాళిక వ్యయం మూడింతలు పెంచినట్లు ఆయన తెలిపారు. దేశంలో కన్నా రాష్ట్రంలో సంపద వేగంగా పెరుగుతోందని ఆయన చెప్పారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి గురించి కూడా శాసనసభలో చర్చ జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రభుత్వం తప్పు చేస్తే విమర్శించాలని, తప్పులు చేస్తే సరిదిద్దుకుంటామని, చర్చ జరగకుండా చేయడం వల్ల ప్రజలకు ప్రయోజనం చేకూరదని ఆయన అన్నారు. కొత్త పన్నులు వేయకుండా పన్నుల వసూళ్లను సమర్థంగా చేయడం వల్ల ఆర్థికాభివృద్ధి జరిగిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
