సిఎం అనుచరుడే సూత్రధారి: బాబు
హైదరాబాద్: సర్వ శిక్ష అభియాన్ లో ముఖ్యమంత్రి వెనక ఉండేవారే సూత్రధారులని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. పేద పిల్లలు దక్కాల్సిన సర్వ శిక్షా అభియాన్ నిధుల్లో అవినీతి చోటు చేసుకుంటే చర్యలు లేవని, తన వెంట ఉన్నవారు అవినీతికి పాల్పడినా చర్యలుండవని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పదలుచుకున్నట్లున్నారని ఆయన శనివారం శాసనసభలో అన్నారు. అసైన్డ్ భూములన్నీ లాక్కుని కోటీశ్వరులకు కట్టబెడుతున్నారని ఆనయ విమర్శించారు.
అర్హులకు ఇళ్లు లేవు, అనర్హులకు పింఛన్లు ఇస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రైతు రుణాలను మాఫీ చేయాలని, వరద బాధితులను ఆదుకోవాలని ఆనయ ప్రభుత్వాన్ని కోరారు. ఇందిరమ్మ గ్రామాలన్నీ అవినీతి మయమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
