ఐటి ద్వారా 8 లక్షల ఉద్యోగాలు: రోశయ్య
హైదరాబాద్: ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి)లో 8 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నట్లు ఆర్థిక మంత్రి కె. రోశయ్య తన బడ్జెట్ ప్రసంగంలో శనివారం శాసనసభలో చెప్పారు. రాష్ట్రంలో ఐటి విశేషంగా అభివృద్ధి చెందుతోందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఏర్పాటయ్యే ప్రత్యేక ఆర్థిక మండళ్లలో 41 ఐటి మండళ్లున్నాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఐటి పారిశ్రామికాభివృద్ధికి బహుళ జాతి సంస్థలతో పాటు దేశీయ సంస్థలను కూడా ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలో మరో 15 ఐటి సంస్థలు ఏర్పాటు కానున్నాయని, వీటి ద్వారా లక్షా 49 వేల మందికి ఉపాధి లభిస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 513 రాజీవ్ ఇంటర్నెట్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఐటి ఎగుమతులు 52 శాతం ఉన్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని 5 వేల ఉన్నత పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఐటి, కంప్యూటర్ విద్యలను బోధనాంశాలుగా ప్రవేశపెట్టనున్నట్లు, అందుకు 60 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
