చిరంజీవి పార్టీకి 56 సీట్లు: మంత్రి దివాకరరెడ్డి
హైదరాబాద్: హీరో చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే రాష్ట్రంలో రాజకీయ పరిస్ధితుల్లో మార్పులు వస్తాయని రాష్ట్ర మంత్రి జెసి దివాకరరెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ప్రాంగణంలో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పారు. చిరంజీవి గురించి ఎక్కువగాను, తక్కువగాను మాట్లాడం కాంగ్రెస్ నాయకులకు తగదని ఆయన అన్నారు. చిరంజీవి పార్టీ పెట్టుకుంటే ఆయనకు 56 కు తగ్గకుండా సీట్లు వస్తాయని ఆయన అంచనా వేశారు. చిరంజీవి పార్టీ పెడితే తెలుగుదేశం పార్టీ మూడో స్ధానానికి పడిపోవడం ఖాయమని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తన వ్యవహార శైలి మార్చుకోక పోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తధ్యమని దివాకరరెడ్డి పేర్కొన్నారు. సర్వేలు, వాస్తవాలను పరిశీలించకుండా వైఎస్ తనవారందరికీ టికెట్లు ఇస్తే ఈసారి ప్రతిపక్షంలో కూర్చోవలసి వస్తుందని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
