వైయస్ ది దురహంకారం: కెసిఆర్

హైదరాబాద్: తెలంగాణ సమస్యను కాశ్మీర్ సమస్యతో పోల్సడం ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి దురహంకారానికి నిదర్శనమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. అందుకు ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తమ రాజీనామాలపై ప్రజలకు వివరించేందుకు చేపట్టిదలచిన బస్సు యాత్రకు ముందు వరంగల్ జిల్లాలోని సమ్మక్క సారక్కల దర్శనం చేసుకోవడానికి బయలుదేరే ముందు ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

తనపై విమర్శలు చేసిన మంత్రి షబ్బీర్ అలీపై, కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ అధక్షుడు దానం నాగేందర్ పై ఆయన విరుచుకుపడ్డారు. మతకల్లోలాలను రెచ్చగొట్టడానికి వీరిద్దరు యత్నిస్తున్నారని ఒక ఉగ్రవాది నార్కో ఎనాలిసిస్ పరీక్షల్లో వెల్లడించాడని, ఈ విషయమై తాను తగిన ఆధారాలు బయటపెడతానని ఆయన అన్నారు. సమ్మక్క సారక్కల దర్శనం అనంతరం తమ శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న 16 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర నిర్వహిస్తామని, తెలంగాణ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+