ఒరిస్సాలో నక్సలైట్ల దాడి, 14 మంది పోలీసుల హతం
భువనేశ్వర్: భువనేశ్వర్ కు 130 కిలోమీటర్ల దూరంలో నయాగఢ్ లో పోలీసులపై సాయుధ నక్సలైట్లు చేసిన దాడిలో 14 మంది పోలీసులు, ఒక సాధారణ పౌరుడు మరణించారు. శుక్రవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది.
నయాగడ్ లోని పోలీసు స్టేషన్ల మీద, పోలీసు శిక్షణ కేంద్రం మీద, డిస్ట్రిక్ట్ ఆర్మొరీ మీద నక్సలైట్లు దాడి చేశారు. ఈ దాడి జరిగిన తర్వాతం ఆయుధాలు దొంగిలించి నక్సలైట్లు బస్సులో పారిపోయినట్టు నయాగఢ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ కుమార్ చెప్పారు.












Click it and Unblock the Notifications
