రోశయ్య ప్రజాకర్షక బడ్జెట్
హైదరాబాద్: 2008 - 09 సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి కె. రోశయ్య పన్నులు లేని బడ్జెట్ ను శనివారం శాసనసభలో ప్రతిపాదించారు. లక్షా 436 కోట్లతో ఈ బడ్జెట్ ను ఆయన ప్రతిపాదించారు. ప్రణాళికా వ్యయం 48,551 కోట్ల రూపాయలు కాగా ప్రణాళికేతర వ్యయం రూ. 51,885 కోట్లు. 2008 - 09లో ద్రవ్యలోటును 3 శాతానికి తగ్గించడం లక్ష్యమని మంత్రి చెప్పారు. 134 కోట్ల రూపాయల నికర రెవెన్యూ మిగులు తేలగలదని ఆయన అంచనా వేశారు. వ్యవసాయం, తాగు, సాగునీటి రంగాలకు కేటాయింపులు భారీగా ఉన్నాయి. వైద్య, విద్యారంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. మైనారిటీలకు వరాలు ప్రకటించారు. 13 సార్లు రాష్ట్ర బడ్జెట్ ను ప్రతిపాదించిన రికార్డును రోశయ్య సాధించారు. నాలుగేళ్లుగా వేయి కోట్ల యూనిట్ల ఉచిత విద్యుత్తును అందించినట్లు ఆయన తెలిపారు. మొత్తం మీద రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రోశయ్య ప్రజాకర్షక బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లు కనిపిస్తోంది.
బడ్జెట్ ముఖ్యాంశాలు
- జలయజ్ఞానికి కేటాయింపులు రూ. 17,875 కోట్లు
- గృహనిర్మాణానికి (ఇందిరమ్మ ఇళ్లకు) కేటాయింపులు రూ. 5850 కోట్లు. విద్యరంగానికి కేటాయింపులు రూ. 1,771 కోట్లు
- ఆహార భద్రతకు రూ. 30 కోట్లు
- గర్భిణీ, చిన్నపిల్లల పోషకాహారానికి 471 కోట్లు
- విద్యుత్ వినియోగ సంస్థలకు సబ్సిడీకి రూ. 2,385 కోట్లు
- రైతులకు పావలా వడ్డీ రుణాలకు రూ. 310 కోట్లు
- పంచాయతీరాజ్ శాఖకు కేటాయింపులు రూ. 549 కోట్లు
- మెట్రో రైలు ప్రాజెక్టుకు కేటాయింపులు రూ. 150 కోట్లు
- 55 కోట్లతో ఏవియేషన్ కార్పోరేషన్
- మైనారిటీల సంక్షేమానికి రూ. 177 కోట్లు
- విమానాశ్రయాల అభివృద్ధికి రూ. 60 కోట్లు
- రెండు రూపాయలకు కిలో బియ్యానికి రూ. 1980 కోట్లు
- మున్సిపాలిటీలకు కేటాయింపులు రూ.3130 కోట్లు
- రేవుల అభివృద్ధికి రూ.5.24 కోట్లు
- పంచాయతీరాజ్ శాఖకు రూ. 549 కోట్లు
- పశుక్రాంతికి రూ. 200 కోట్ల కేటాయింపు
- సాగునీటికి కేటాయింపులు 16,500 కోట్లు
- జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ కేంద్రాలకు కేటాయింపులు రూ.11 కోట్లు
- 2015 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధన
- మధ్యాహ్న భోజనానికి రూ. 853 కోట్ల కేటాయింపులు
- హాస్టల్ విద్యార్థులకు ఏటా 4 జతల దస్తుల పంపిణీ
- గిరిజన సంక్షేమానికి కేటాయింపులు రూ.353 కోట్లు
- శ్రీకాకుళం, మహబూబ్ నగర్, కర్నూలుల్లో కొత్త విశ్వవిద్యాలయాలకు రూ. 15 కోట్ల కేటాయింపు
- రాష్ట్రంలో 71 ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటుకు కేంద్రం అనుమతి, ఇప్పటికే 49 ప్రకటన. 25 లక్షల మందికి ఉపాధి.
- రోడ్లు, భవనాల శాఖకు కేటాయింపులు రూ.14040 కోట్లు
- పంచాయతీ రాజ్ రోడ్ల అభివృద్ధికి రూ. 540 కోట్లు
- రాజమండ్రి, కడప విమానాశ్రయాల అభివృద్ధికి రూ. 60 కోట్ల కేటాయింపులు
- వైద్య, ఆరోగ్యానికి రూ. 1,315 కోట్ల కేటాయింపు
- పింఛన్లకు కేటాయింపులు రూ. 1390 కోట్లు
- ఆరోగ్య బీమాకు రూ. 450 కోట్ల కేటాయింపు
- వైనారిటీల కళ్యాణమస్తుకు కేటాయింపు రూ. 5 కోట్లు
- క్రిస్టియన్ల తీర్థయాత్రలకు కేటాయింపు రూ. 2 కోట్లు
- కళాకారుల పింఛన్లకు రూ. 6.44 కోట్ల కేటాయింపు
- మంచినీటికి కేటాయింపు రూ. 5,688 కోట్లు
- గ్రామీణ ఉపాధి హామీ పథకం మరో మూడు జిల్లాలకు విస్తరణ
- గ్రంధాలయాల మెరుగుకు కేటాయింపులు రూ. 250 కోట్లు
- పట్టణాల అంతర్గత రోడ్ల అభివృద్ధికి కేటాయింపు రూ. 200 కోట్లు
- రాజీవ్ యువశక్తి పథకం అమలుకు రూ. 87.50 కోట్ల కేటాయింపు
- ఈ ఏడాది 30 లక్షల ఇందిరమ్మ గృహాలు
- నూజివీడు, బాసర, ఇడుపులపాయల్లో త్రిపుల్ ఐటీలకు 320 కోట్ల కేటాయింపు
- గిరిజన ప్రాంతాల్లో ఐదు కొత్త డిగ్రీ కళాశాలలు
- 636 రెసిడెన్షియల్ పాఠశాలల అభివృద్ధికి కేటాయింపు రూ. 400 కోట్లు
- మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయింపు రూ. 2277 కోట్లు
- గుంటూరు, వరంగల్, కాకినాడల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు
- భూపంపిణీ, అభివృద్ధికి కేటాయింపులు రూ. 100 కోట్లు
- చేనేత కార్మికుల సాయానికి కేటాయింపులు రూ. 34.04 కోట్లు
- చేనేత కార్మికులకు పావలా వడ్డీ రుణాలకు కేటాయింపులు రూ. 16.09 కోట్లు
- స్యయం సహాయక సంఘాలకు కేటాయింపులు రూ. 10 వేల కోట్లు
- 2009 మార్చి నాటికి 27 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి












Click it and Unblock the Notifications
