సంజయ్, మాన్యతల పెళ్లి చెల్లదు
గోవా: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, మాన్యతల పెళ్లి చెల్లుబాటు కాదని గోవా సబ్ రిజిస్ట్రార్ చెప్పారు.మాన్యతకు ఇచ్చిన నివాస సర్టిఫికెట్ ను గోవాలోని మార్గో జిల్లా ఉన్నతాధికారి సస్పెండ్ చేశారు. దత్, మాన్యతల వివాహం ఈ నెల 7వ తేదీన గోవాలో జరిగింది. ఈ విషయమై న్యాయ నిపుణుల సలహాను గోవా ప్రభుత్వం తీసుకుంటోంది. ఈ వివాహం గోవా ప్రత్యేక వివాహ చట్టం కింద జరిగింది.
ఇదిలా వుంటే, తనకు విడాకులు ఇవ్వకుండా మాన్యత సంజయ్ దత్ ను పెళ్లి చేసుకోవడం చెల్లదని బాంద్రా కోర్టులో ఒక వ్యక్తి దావా వేశాడు. తమకు ఒక కుమారుడు కూడా ఉన్నాడని అతను అంటున్నాడు. అయితే బాలీవుడు నటీమణులను ఫోనుల ద్వారా అల్లరి పెట్టిన కేసులో అతను నిందితుడు.












Click it and Unblock the Notifications
