28న ఢిల్లీలో తెలంగాణ కవులు, కళాకారుల ధర్నా
న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించవలసిందిగా కోరుతూ తెలంగాణ రచయితలు, కళాకారులు ఈనెల 28న పార్లమెంటు భవనం ఎదుట ధర్నా చేయనున్నారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 500 మంది ధర్నాలో పాల్గొంటారని తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ పాశం యాదగిరి, ఢిల్లీ తెలంగాణ సంఘం కన్వీనర్ పి. నిరూప్ విలేకరులకు చెప్పారు.
జంతర్ మంతర్ లో జరిగే ఈ ధర్నా దెబ్బకు తెలంగాణ వచ్చి తీరాలని వారు అన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ధర్నాకు హాజరవుతారని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications
