మంచి బడ్జెట్: వైయస్, కాదు: బాబు
హైదరాబాద్: ఆర్థిక మంత్రి కె. రోశయ్య ప్రతిపాదించిన బడ్జెట్ ను ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రశంసలతో ముంచెత్తారు. ఇది మన పొరుగు దేశం బంగ్లాదేశ్ బడ్జెట్ కన్నా పెద్దదని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఇది మంచి బడ్జెట్ అని, అందుకు రోశయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు.
రోశయ్య ప్రతిపాదించిన బడ్జెట్ పట్ల ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు పెదవి విరిచారు. రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా రాజ్యమేలుతోందని ఆయన విడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. లక్ష కోట్ల రూపాయల విలువ చేసే భూములను ప్రభుత్వం విక్రయించిందని ఆయన విమర్శించారు. ప్రాధాన్యతలకు అనుగుణంగా కేటాయింపులు లేవని ఆయన అన్నారు. బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి, సంక్షేమానికి తగిన కేటాయింపులు లేవని ఆయన అన్నారు. పోలీసు శాఖను నిధులు కేటాయించకుండా గాలికి వదిలేశారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
