లాలూకు అడ్డు తగిలిన టిడిపి
న్యూఢిల్లీ: రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే బడ్జెట్ ప్రతిపాదనలపై తెలుగుదేశం పార్లమెంటు సభ్యులతో పాటు మరి కొన్ని పార్టీల సభ్యులు నిరసన తెలియజేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ ప్రసంగానికి వారు మంగళవారం లోకసభలో అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. తీవ్ర నిరసనల మధ్యనే లాలూ తన రైల్వే బడ్జెట్ ప్రసంగాన్ని చదివారు. స్పీకర్ సోమనాధ్ ఛటర్జీ ఎంతగా నచ్చజెప్పినప్పటికీ వారు వినలేదు.
లాలూ ప్రతిపాదనలకు తీవ్ర అభ్యంతరం తెలియజేస్తూ వారు సభ నుంచి వెళ్లిపోయారు. తమిళనాడుకు, ఉత్తరాదికి లాలూ ప్రసాద్ యాదవ్ తన బడ్జెట్టులో ప్రాధాన్యం ఇచ్చారని వారు విమర్శించారు. రైల్వే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టిడిపిపి) నేత కె. ఎర్రంనాయుడు అభ్యంతరం తెలిపారు. రైల్వే బడ్జెట్ పై తెలుగుదేశం సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications