తెలంగాణపై ఏదో ఒకటి చేయండి: కావూరి
ఏలూరు: రాష్ట్ర విభజనపై ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసుకోవాలని, ఈ విషయంలో జాప్యం రాష్ట్ర ప్రజలకు మంచిది కాదని కాంగ్రెస్ ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ పార్టీలతో సంప్రదించి తొందరగా నిర్ణయం ప్రకటించడం అవసరమని, జాప్యం తెలంగాణకు గానీ ఆంధ్రాకు గానీ మంచిది కాదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిథులతో అన్నారు.
తెలంగాణ ఇవ్వడం వల్ల అటు తెలంగాణకు, ఇటు ఆంధ్రకు మంచి జరుగుతుందనుకుంటే అందుకు నిర్ణయం తీసుకోవాలని, రాష్ట్ర విభజన వల్ల ఏర్పడే చిన్న రాష్ట్రాల వల్ల కేంద్రంలో పలుకుబడి నష్టపోతామనుకుంటే తెలంగాణ ఇవ్వడం లేదని చెప్పాలని, ఏదో ఒకటి త్వరగా తేలిపోవడం అవసరమని ఆయన అన్నారు. వ్యక్తిగతంగా తాను సమైక్యాంధ్రకే కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications