హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ గురువారంనాడు హైదరాబాద్ వచ్చారు. జోథా అక్బర్ తెలుగు వెర్షన్ ప్రివ్యూ షోలో పాల్గొనేందుకు ఆమె హైదరాబాద్ వచ్చారు. తల్లి బృందారాయ్ తో కలిసి ఆమె ఇక్కడికి వచ్చారు. జోథా అక్బర్ తెలుగు వెర్షన్ ఆంధ్రప్రదేశ్ అంతటా గురువారంనాడు విడుదలైంది.
హైదరాబాద్ లోని పివిఆర్ థియేటరులో జరిగే జోథా అక్బర్ ప్రివ్యూ షోలో ఐశ్వర్యా రాయ్ పాల్గొంటారు. ఈ షోలో హీరో రితిక్ రోషన్ కూడా పాల్గొంటారు. ఇందుకుగాను దర్శకుడు అసుతోష్ కూడా హైదరాబాద్ చేరుకున్నారు.