చిరంజీవి దెబ్బ విపక్షాలపైనే: జీవన్ రెడ్డి
తిరుమల: మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెడితే ప్రతిపక్షాలకే దెబ్బ అని, తమ కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన నష్టం లేదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి టి. జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మహా శివరాత్రి సందర్భంగా ఆయన గురువారంనాడు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రజాప్రతినిధుల రాజీనామాలు బాధ్యతారహితమైన చర్య అని ఆయన వ్యాఖ్యానించారు. రాజీనామాలు తెరాస రాజకీయ నాటకమని ఆయన అభివర్ణించారు.
తమ రాజీనామాలకు భయపడే హైదరాబాదులో సోనియా తన సభను రద్దు చేసుకున్నారనే తెరాస వ్యాఖ్యను ఆయన ఖండించారు. ఉగ్రవాదుల దాడికి కూడా భయపడకుండా కాశ్మీరులో పర్యటించిన ధీరవనిత సోనియా అని, ఆమె తెరాసకు భయపడుతుందనేది మూర్ఖత్వమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తీవ్రవాదం పెచ్చరిల్లుతుందనే వాదనతో తాను ఏకీభవించడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications