చంద్రబాబుతోనే ఉంటా: కడియం
హైదరాబాద్: తాను తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడితో కలిసే ఉంటానని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. చంద్రబాబుతో భేటీ అనంతరం గురువారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను చంద్రబాబుకు గానీ, పార్టీకి గానీ వ్యతిరేకంగా మాట్లాడలేదని ఆయన అన్నారు.
పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని తాను చంద్రబాబును కోరినట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో పార్టీని బతికించాలనేదే తన ఆరాటమని, అందుకే తెలంగాణ గురించి మాట్లాడానని ఆయన వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications