రాజీనామాలు మంచివి కావు: షబ్బీర్
హైదరాబాద్: ఐదేళ్లు కొనసాగాలని ప్రజలు ఎన్నుకుంటే మధ్యలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రజాప్రతినిధులు రాజీనామా చేయడం మంచిది కాదని రాష్ట్ర విద్యుచ్ఛక్తి శాఖా మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. తెలంగాణపై తాము తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. అభివృద్ధిలో తమను ఎవరూ తప్పు పట్టలేరని ఆయన అన్నారు. ఉచిత విద్యుత్ ద్వారా లబ్ధి పొందుతున్నవారిలో 50 శాతానికి పైగా తెలంగాణ రైతులేనని ఆయన అన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ కోత లేదని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయానికి గానీ, పరిశ్రమలకు గానీ విద్యుత్ కోత విధించలేదని ఆయన చెప్పారు. విద్యుదుత్పత్రి 70 - 80 మెగావాట్లు తగ్గినందున విద్యుత్ సరఫరాలో కొంత అంతరాయం కలుగుతోందని ఆయన చెప్పారు. రామగుండంలో ఒక ట్రాన్స్ ఫారం పనిచేయడం లేదని, దాంతో ఆ ప్రాంతంలో కొంత ఇబ్బంది ఏర్పడిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications