శైవ క్షేత్రాల్లో భక్త కోటి

శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలోని భ్రమారాంబికా సమేతుడైన శ్రీ మల్లికార్జున స్వామి వారిని బుధవారం పురవీధుల్లో విశేష అలంకరణలతో ఊరేగింపు నిర్వహించారు. అలాగే గురువారం శివరాత్రి సందర్భంగా స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. మరోవైపు దక్షిణ కాశిగా పేరొందిన శ్రీకాళహస్తి క్షేత్రంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి సమేతుడైన స్వామివారికి హంస వాహన సేవ నిర్వహించారు. అలాగే మరో శైవ క్షేత్రమైన వేములవాడలోను శివారాత్రి సందర్భంగా శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయానికి 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. అలాగే కాళేశ్వరాలయం కూడా భక్తులతో కిటకిటలాడుతోంది. మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద యెత్తున వస్తున్నారు.












Click it and Unblock the Notifications