తెలంగాణపై పాత వైఖరి కాదు: ఎర్రం
హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ప్రణబ్ కమిటీకి తాము లేఖను అందించిన విషయం నిజమేనని, అయితే తాము దానికి కట్టుబడి లేమని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టిడిపిపి) నాయకుడు కె. ఎర్రంనాయుడు స్పష్టం చేశారు. కడియం శ్రీహరి లాంటి సీనియర్ నాయకులు సొంత అభిప్రాయాలను వెల్లడించడం పార్టీకి నష్టమని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
తెలంగాణపై పార్టీ మహానాడు తీర్మానాలపై ఇంకా చర్చ జరగలేదని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజల మనోభావాలు తమకు తెలుసునని ఆయన చెప్పారు. మారుతున్న పరిణామాలను తాము గమనిస్తున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications