జైపూర్ లో చంద్రబాబు హిందీ ప్రసంగం
జైపూర్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు జైపూర్ లో ఆదివారం జరిగిన యుఎన్ పిఎ బహిరంగ సభలో హిందీలో మాట్లాడారు. రాసుకున్న ప్రసంగాన్ని ఆయన చదివి వినిపించారు. అనంతరం ఆయన ఆంగ్లభాషలో ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సంపన్నులు సంపన్నులుగా, పేదలు మరింత పేదలుగా మారుతున్నారని ఆయన విమర్శించారు. సంపన్నులు, పేదల మధ్య ఆర్థిక అంతరాలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. ఆర్థిక సంస్కరణల ఫలితాలు సంపన్నులకే అందుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే అందుకు కారణమని ఆయన అన్నారు.
జైపూర్ బహిరంగ సభ చారిత్రాత్మకమైందని, రైతుల సంక్షేమం కోసం యుఎన్ పిఎ తుది దాకా పోరాడుతుందని ఆయన చెప్పారు. తాను ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక సంస్కరణలను మొదలు పెట్టానని, ఫలితంగా హైదరాబాదు దేశం ఐటి రాజధానిగా ఎదిగిందని ఆయన చెప్పారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరిగాయని ఆయన విమర్శించారు. సభలో ఇతర యుఎన్ పిఎ నాయకులు కూడా ప్రసంగించారు.












Click it and Unblock the Notifications
