బ్రిటిష్ టూరిస్టుపై అత్యాచారం, హత్య
పానాజి: గోవాలో 15 ఏళ్ల బ్రిటిష్ టూరిస్టు స్కార్లెట్టి కీలింగ్ పై ముగ్గురు వ్యక్తులు అత్యాచారాని పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారిని అరెస్టు చేసే అవకాశం ఉంది. స్కార్లెట్టీ నీళ్లలో మునిగి చనిపోయినట్లు మొదట భావించారు. అయితే ఆమె లైంగిక అత్యాచారానికి గురైనట్లు పరీక్షల్లో తేలింది.
ఈ కేసులో మత్తు మందుల వినియోగం గురించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చనిపోవడానికి ముందు స్కార్లెట్టీ ముగ్గురు వ్యక్తులతో కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఆ ముగ్గురు డ్రగ్ డీలర్లై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వారు కొకైన్ తీసుకున్నట్లు కూడా పోలీసులు నిర్ధారించుకున్నారు. మరో నలుగురు వ్యక్తులకు కూడా ఇందులో భాగం ఉండవచ్చునని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. అత్యాచారం, హత్య కేసులను నమోదు చేసినట్లు వారు తెలిపారు.












Click it and Unblock the Notifications
