చంద్రబాబే ముందు చెప్పాలి: దత్తాత్రేయ
హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెస్ కన్నా ముందే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తన వైఖరిని ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోనందుకు నిరసనగా రేపటి నుంచే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్ర పర్యటనను నిరసిస్తూ ఆందోళనలు చేపట్టనున్నట్లు ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఈ నెల 14వ తేదీన సోనియా రాష్ట్ర పర్యటనను నిరసిస్తూ బిజెపి రాష్ట్ర బంద్ ను తలపెట్టింది.
బిసి కార్పోరేషన్ నుంచి తీసుకున్న రుణాలను, చేనేత వృత్తి పనివారలు తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 20వ తేదీ నుంచి రాజకీయ సంకల్ప శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అధిక ధరలపై, ఇతర సమస్యలపై ఈ కార్యక్రమంలో కార్యకర్తలను చైతన్యవంతులను చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
