వధూవరులకు వైయస్ ఆశీర్వాదాలు
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఒకే ముహూర్తానికి దాదాపు 7 వేల జంటలు ఒక్కటయ్యాయి. హైదరాబాదులోని లలిత కళాతోరణంలో జరిగిన కళ్యాణమస్తులో 111 జంటలు పెళ్లి చేసుకున్నాయి. ఇక్కడి జంటలను ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, గవర్నర్ ఎన్.డి. తివారీ ఆశీర్వదించారు. ఈ కళ్యాణమస్తు కార్యక్రమంలో సినీ నటుడు రాజశేఖర్, ఆయన భార్య జీవిత కూడా పాల్గొన్నారు. టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఇక్కడి కార్యక్రమంలో పాల్గొన్నారు.
తిరుపతిలో జరిగిన కళ్యాణమస్తులో 62 మందికి పెళ్లిల్లు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యుడు వెంకటరమణ ఇక్కడి జంటలకు హానీమూన్ యాత్ర ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. వరంగల్ లో వృద్ధ జంట ఒక్కటైంది. 63 ఏళ్ల రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ఓదేలు, 40 ఏళ్ల వెంకటలక్ష్మి ఒక్కటయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కరపలో జరిగిన కళ్యాణమస్తులో అపశృతి చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు మృతి చెందారు. విజయవాడ, విశాఖపట్నాల్లో కూడా కళ్యాణమస్తు వైభవంగా జరిగింది.












Click it and Unblock the Notifications
