నడిచేది వైయస్, నడిపించేది కెవిపి: ఎమ్మెస్సార్
కరీంనగర్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిపై, ఆయన సన్నిహిత మిత్రుడు, ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచందర్ రావుపై కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఎం. సత్యనారాయణ రావు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నడిచేది వైయస్ రాజశేఖర రెడ్డి, నడిపించేది కెవిపి రామచందర్ రావు అని ఆయన వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తాను ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనని ఆయన చెప్పారు.
తెలంగాణ కోసం రాజీనామా చేయాలని సత్యనారాయరావును డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆయనకు గులాబీ పూలు ఇచ్చి కాళ్లు మొక్కారు. తెలంగాణ కోసం తాను చివరంటా పోరాడుతానని ఆయన చెప్తూ వస్తున్నారు. అయితే తాను రాజీనామా మాత్రం చేయబోనని అంటున్నారు. ఈ స్థితిలో తెరాస కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు.












Click it and Unblock the Notifications
