ఢిల్లీలో దాడి: ఆంధ్ర నేతలకు గాయాలు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని సిపియం కేంద్ర కార్యాలయంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్స్) కార్యకర్తలు ఆదివారంనాడు దాడి చేశారు. ఈ దాడిలో పది మంది గాయపడ్డారు. గాయపడినవారిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సిపియం నాయకులు వి. శ్రీనివాసరావు, తమ్మినేని వీరభద్రం ఉన్నారు. ఆరెస్సెస్ కార్యకర్తల నిరసన హింసకు దారి తీసింది. సిపియం, ఆరెస్సెస్ కార్యకర్తలు పరస్పరం దాడికి దిగారు. సిపియం కార్యాలయంపైకి ఆరెస్సెస్ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఆ సమయంలో సిపియం కేంద్ర కమిటీ సమావేశం జరుగుతోంది.
గాయపడిన పదిమందిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. సంఘటనా స్థలంలో రాపిడ్ యాక్షన్ ఫోర్సును మోహరించారు. దాడిలో సిపియం కార్యాలయానికి కొంత నష్టం జరిగింది. సిపియం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, పోలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి కార్లు ధ్వంసయ్యాయి. దీంతో కేంద్ర కమిటీ సమావేశాన్ని సిపియం నిలిపేసింది. పరిస్థితిని సమీక్షించడానికి పోలిట్ బ్యూరో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పలువురు ఆరెస్సెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కేరళలో తమ పార్టీ కార్యకర్తల హత్యలకు నిరసనగా ఆరెస్సెస్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు ఈ హింస చెలరేగింది.












Click it and Unblock the Notifications
