బాలకృష్ణకు రాజ్యసభ సీటు: నల్లపురెడ్డి

హైదరాబాద్: సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు కుమారుడు నందమూరి బాలకృష్ణకు రాజ్యసభ సీటు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పార్టీ నాయకత్వాన్ని కోరారు. పార్టీ శ్రేయస్సు కోసం బాలకృష్ణకు రాజ్యసభ సీటు ఇవ్వడం అవసరమని ఆనయ నెల్లూరులో అన్నారు. నందమూరి వంశం ఇమేజ్ ముందు ఏ సినీ స్టార్ ఇమేజ్ కూడా నిలువదని ఆయన అన్నారు. బాలకృష్ణకు రాజ్యసభ సీటు ఇస్తే మరో సినీ నటుడికి రాజకీయాల్లో అవకాశం ఉండదని ఆయన అన్నారు.

మెగాస్టార్ చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టబోతున్నారనే వార్తల నేపథ్యంలో ఆయన బాలకృష్ణకు తెలుగుదేశంలో స్థానం కల్పించాల్సిన అవసరం గురించి మాట్లాడారని అనుకోవచ్చు. ఒక్క రాజ్యసభ సీటు కోసం పార్టీలో పలుపురు పోటీ పడుతున్నారు. ఈ స్థితిలో రాజ్యసభ సీటుకు అభ్యర్థిని ఖరారు చేయడం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు సంకటంగానే మారింది.

ఇదిలా ఉంటే, మెగాస్టార్ చిరంజీవి పెట్టబోయే రాజకీయ పార్టీ తీసుకోవాల్సిన అవసరం గురించి హైదరాబాదులో చిరంజీవి అభిమానులు మంతనాలు జరుపుతున్నారు. ఇందుకు గాను వారు రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+