తెలంగాణపై నేతలకు బాబు హెచ్చరిక

Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తూనే అభివృద్ధి నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రాజీనామా చేసిన స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ మంత్రులకు సూచించారు. తెలంగాణ మంత్రులతో ఆయన సోమవారం ఉదయం సమావేశమయ్యారు. శాసనసభ్యుల మృతి వల్ల ఖాళీ అయిన తెర్లాం, ఖైరతాబాద్ శాసనసభా నియోజకవర్గాలతో పాటు తెరాస రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన లోకసభ, శాసనసభా నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి మంత్రులతో చర్చించి కొన్ని సూచనలు చేశారు.

తెలంగాణపై తమ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, ఇదే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని ముఖ్యమంత్రి మంత్రులకు సూచించారు. కాంగ్రెస్ మాత్రమే తెలంగాణను ఇవ్వగలదని చెప్పాలని కూడా ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ దురుద్దేశ్యాన్ని ప్రజలకు తెలియజేయాలని ఆయన మంత్రులకు చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు పరిస్థితులు అనుకూలంగా లేవని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. తెరాస కింది స్థాయి కార్యకర్తలను ఎదుర్కునే వ్యూహాన్ని అనుసరించాలని సమావేశం అభిప్రాయపడింది. ఈ సమావేశానికి 18 మంది మంత్రులు హాజరయ్యారు. ఉప ఎన్నికలు జరిగే స్థానాలకు మంత్రులను ముఖ్యమంత్రి ఇంచార్జీలుగా నియమించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీకి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సోమవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నారు. రాజ్యసభ ఎన్నికలపై ఆయన సోనియాతో మాట్లాడే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+