నాగాలాండ్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు డీఏఎన్ సన్నాహాలు
కోహిమా: నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) నేతృత్వంలోని నాగాలాండ్ ప్రజాస్వామ్య కూటమి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇటీవల జరిగిన నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 సీట్లకుగానూ 30 స్థానాల్లో విజయం సాధించిన డీఏఎన్ కూటమికి నలుగురు స్వతంత్ర అభ్యర్థులు బేషరతు మద్దతు ప్రకటించారు.
నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫ్యూ రియో ఆదివారం డీఏఎన్ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయిన అనంతరం మద్దతిస్తున్న 33 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్ కె.శంకరనారాయణ్‌ను రాజ్‌భవన్‌లో కలశారు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయగల మెజారిటీ తమ కూటమికి ఉందని రియో ఈ సందర్భంగా గవర్నర్‌కు తెలియజేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు.












Click it and Unblock the Notifications
