ముఖేష్ పై ఏం మాట్లాడ్తాం: ఉప్పునూతల
హైదరాబాద్: మంత్రి ముఖేష్ వ్యాఖ్యల గురించి తాను మాట్లాడదలుచుకోలేదని సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రాజీనామా చేసిన స్థానాల్లో కాంగ్రెస్ గెలిస్తే మంచిదేనని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉందని, తెలంగాణ ఇవ్వడం తప్ప మరో మార్గం లేదని ఆయన అన్నారు.
రాష్ట్ర సమైక్యవాదం గురించి మాట్లాడుతున్నవారు ఒక సమైక్యవాద సభ పెడితే తెలంగాణ సెంటిమెంటు బలం ఏమిటో తెలిసి వస్తుందని, అలా ఒక సభ పెట్టి చూడాలని ఆయన అన్నారు. తెలంగాణ వద్దనే వారు బహిరంగంగా ముందుకు రావాలని ఆయన సవాల్ చేశారు. తెలంగాణ నాయకత్వం వద్దని బహిరంగంగా చెప్పాలని ఆయన అన్నారు. తెలంగాణ బలమేమిటో తాము ఈ నెల 24వ తేదీన పెట్టే సభ తర్వాత తెలిసివస్తుందని ఆయన అన్నారు. తాము ఎవరికీ భయపడేది లేదని, తామేమీ దొంగతనం చేయడం లేదని, తెలంగాణ ఇవ్వాలని మాత్రమే అడుగుతున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
