ఎన్టీఆర్ పేరు కోసం టిడిపి పట్టు

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీ రామారావు పేరు పెట్టాలని, వికలాంగుల సమస్యలపై వామపక్షాలు, విమానాశ్రయాల్లో సిబ్బంది సమ్మెపై బిజెపి వాయిదా తీర్మానాలు ప్రతిపాదించాయి. వాటిని స్పీకర్ తిరస్కరించారు. తెలుగువారిని ఉనికి ఢిల్లీకి చాటిన ఎన్టీ రామారావు పేరును ఒక టెర్మినల్ కు కూడా పెట్టకపోవడంపై తెలుగుదేశం నిరసన వ్యక్తం చేసింది. ఈ అంశంపై చర్చకు అనుమతించాలని పట్టు పట్టింది. నోటీసు ఇస్తే చర్చకు అవకాశం ఇస్తానని స్పీకర్ చెప్పారు. అయినా వినకుండా తెలుగుదేశం సభ్యులు ఆందోళనకు దిగడంతో సభను స్పీకర్ 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications