రాజ్యసభ టిడిపి అభ్యర్థి హరికృష్ణ
హైదరాబాద్: రాజ్యసభకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కుమారుడు నందమూరి హరికృష్ణ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. పార్టీలో అభిప్రాయ సేకరణ జరిపిన అనంతరం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హరికృష్ణ పేరును ఖరారు చేసినట్లు చెబుతున్నారు. అయితే ఆయన పేరును ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. శుక్రవారంనాడు అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
రాష్ట్రం నుంచి రాజ్యసభకు తెలుగుదేశం పార్టీ నుంచి ఒకరికే అవకాశం ఉంటుంది. ఈ ఒక్క సీటుపై పలువురు నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ఈ సీటుపై ఆశలు పెట్టుకున్న కంభంపాటి రామ్మోహనరావు అలిగినట్లు సమాచారం. ఈ సీటును ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా ఆశించారు. వీరిద్దరు విడివిడిగా మంగళవారంనాడు శాసనసభ ఆవరణలో చంద్రబాబును కలిశారు. ఒక సీటుకు పోటీ తీవ్రంగా ఉండడంతో హరికృష్ణ పేరును ఖరారు చేస్తే ఎవరూ మాట్లాడబోరని చంద్రబాబు భావించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications