పార్టీ రుణం తీర్చుకుంటా: కెవిపి
హైదరాబాద్: రాష్ట్రం నుంచి ఆరుగురు అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి ఐదుగురు, తెలుగుదేశం నుంచి ఒకరు రాజ్యసభకు ఎన్నికైనట్లు శాసనసభ సచివాలయ కార్యదర్శి తుల్జానంద్ సింగ్ బుధవారం ప్రకటించారు. వారికి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. కాంగ్రెస్ నుంచి కెవిపి రామచంద్రరావు, టి. సుబ్బిరామిరెడ్డి, నంది ఎల్లయ్య, కె.ఎం. ఖాన్, రత్నాబాయి ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ నుంచి హరికృష్ణ ఎన్నికయ్యారు.
తాను వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి సర్వశక్తులు ఒడ్డి కృషి చేస్తానని కెవిపి రామచంద్రరావు చెప్పారు. ఒక కార్యకర్తగా గుర్తించి తనకు ఈ అవకాశం పార్టీ కల్పించిందని, అందుకు పార్టీ రుణం తీర్చుకుంటానని, వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించడం ద్వారా ఈ రుణం తీర్చుకుంటానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి డాక్టర్ సన్నిహిత మిత్రుడు, వ్యక్తిగత సలహాదారు రామచంద్రరావును రాజ్యసభకు పంపడానికి గతంలో ప్రయత్నం జరిగింది. అయితే అప్పుడు వైయస్ ప్రయత్నాలు ఫలించలేదు. ఈసారి ఆ ప్రయత్నం ఫలించి, కెవిపి రాజ్యసభకు ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications